బోటు ప్రమాదంలో మృతిచెందిన మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటాం... మల్లాడి రాజేంద్ర


బోటు ప్రమాదంలో మృతిచెందిన మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటాం... మల్లాడి రాజేంద్ర
 


కాకినాడ రూరల్... ఇటీవల దేవీపట్నం గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన మత్స్యకార   సరంగులు సంగడి నూకరాజు,  పోతా బత్తుల సత్యనారాయణ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మల్లాడి రాజేంద్రప్రసాద్ అన్నారు. కాకినాడ జగన్నాధపురం తన నివాసంలో మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల అయినా కాకినాడ డ్రైవర్స్ కాలనీ కి చెందిన సంగడి నూకరాజు, జగన్నాధపురం కు చెందిన పోతా బత్తుల అప్పారావు వీరి కుటుంబాలను ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని, వారి పిల్లలకు ఉచిత విద్యను ట్రస్టు ద్వారా చేయూత ఇస్తామని తెలియజేశారు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను తెలియజేశారు..