తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక


తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక


(తూర్పుగోదావరి జిల్లా -జి ఎన్ రావ్ )


అమలాపురం హోటల్ గ్రాండ్ పార్క్ నందు ఇటీవల  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ కోడ్‌ను అనుసరించి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్ బాల్  అసోసియేషన్ ప్రతినిధిగా వచ్చిన జి.సురేష్ బాబు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ గా వి.రవిరాజు ఆధ్వర్యంలో జిల్లా బాస్కెట్ బాల్  నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సురేష్ బాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కు  50సంవత్సరాల ఘన చరిత్ర ఉందన్నారు. జిల్లా నుండి రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఎందరో ఉత్తమ క్రీడాకారులు ఉన్నారన్నారు. ప్రభుత్వ క్రీడల నిబంధనలను అనుసరించి నియమ నిబంధనలు పాటించిన వారికే సర్టిఫికేట్స్ ఇచ్చే అర్హత ఉంటుందన్నారు. అనంతరం స్పోర్ట్స్ కోడ్‌ను అనుసరించి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.....కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధిగా వి. రవిరాజు..ప్రముఖ న్యాయవాది వెై వి ఎస్ ఎస్ ఎన్ ప్రసాద్...సీనియర్ క్రీడాకారులు నక్కా రోనాల్డ్ , వేటూరి వెంకటేశ్వరరావు, అంతర్జాతీయ క్రీడాకారుడు నడింపల్లి అప్పలరాజు, క్రీడాకారులు పాల్గొన్నారు...