చంద్రబాబు రెండు రాష్ట్రాల గవర్నర్లుకు శుభాకాంక్షలు


రాష్ట్రాల గవర్నర్లుగా నియమితులైన బండారు దత్తాత్రేయ, తమిళిసై సౌందరరాజన్ లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా, తమిళిసై సౌందర్ రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, చంద్రబాబు వారిరువురికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ బాధ్యతల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు ఫోన్ ద్వారా తెలిపారు.