ఆపదలలో ఆపద్బాంధవు డి లా..


"ఆపదలలో ఆపద్బాంధవు డి లా..


దేవుడిలా రక్షించారు. 


నిన్న రాత్రి  గర్భం తో ఉన్న ఒక మహిళ స్కానింగ్ కొరకు జంగారెడ్డి గూడెం వెళ్లి  ఆటో తిరిగి వస్తుండగా రాత్రి 8.30 నిమిషాల సమయంలో ఒక్క సారిగా నొప్పులు రావడం తో 
ఎమీ చెయ్యాలో అర్ధం కానీ స్థితిలో ఉన్న ఆ గర్భస్థ మహిళకు దేవుడి రూపంలో ప్రత్యక్ష మయ్యడు ఒక ప్రభుత్వ వైద్యుడు..


తాడవాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న డాక్టర్.రాజీవ్  .వేలేరుపాడు వస్తూ ఉండగా ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ మహిళలను చూసి వెంటనే తన కారును ఆపి ఆటో లోనే వైద్య సహాయాన్ని అందించారు. 


ఆ రోడ్డంతా భురధ మయం,కటిక చీకటి అలాంటి పరిస్థితిలో కూడా వైద్యో నారాయణో హరిః అన్నట్లు వెంటనే స్పందించి సెల్ ఫోన్లు లైట్ల వెలుతురులో వైద్యాన్ని అందించి మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డకు సాధారణ ప్రసవం అయ్యేలా చేశారు.


డాక్టర్ రాజీవ్ గారు...... దీంతో విషయం తెలుసుకున్న మండల ప్రజలు రాజీవ్ గారిని అభినందనలతో ముంచెత్తారు.....


"నేను టీవీలో ,పేపర్ లో చూడడం తప్ప ఇలాంటి వైద్యున్ని ఇంతవరకు చూసింది లేదు. కానీ మొదట సారి ప్రత్యక్షంగా చూసాను.నిజంగా మీలాంటి వైద్యులు ఉండడం పేద ప్రజల అదృష్టం.