బోటు ప్రమాదానికి సంబంధించి మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన ఆరోపణలను జిల్లా ఎస్పీ నయీంహష్మి ఖండించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ నుంచి తనకు ఎలాంటి ఫోన్ రాలేదని స్పష్టం చేశారు. బోటును అనుమతించాలని ఎస్‌ఐపై తాను ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఎస్పీ తెలిపారు. పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీకు ఫోన్ చేయటంతో బోటు కదిలిందని హర్షకుమార్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన ఆరోపణలను జిల్లా ఎస్పీ నయీంహష్మి ఖండన