అవమానంతోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు . చంద్రబాబు

మానసిక క్షోభ, భరించలేని అవమానంతోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. మూడు నెలలుగా కోడెలను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. కోడెల టైగర్‌గా బతికాడని, భయం ఎరుగని వ్యక్తి అని.. అలాంటి వ్యక్తిని దారుణంగా వేధింపులకు గురిచేశారని అన్నారు. తెల్లారితే ఏం అవమానం చేస్తారో అని భయపడేంతగా హింసించి.. కోడెల ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ప్రభుత్వ తీరును చంద్రబాబు ఎండగట్టారు. టీడీపీ కార్యకర్తల హత్యలపై, రైతుల ఆత్మహత్యలపై పోరాటం చేశామన్నారు. కానీ కోడెల ఇలా ఆత్మహత్య చేసుకునే రోజు వస్తుందని అస్సలు ఊహించలేదని చంద్రబాబు తన బాధను వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం రాక్షసంగా, అమానవీయంగా ప్రత్యర్థులపై పడుతున్నారని మండిపడ్డారు. కోడెల పోరాటయోధుడని, ఎన్ని సమస్యలు, కేసులు వచ్చినా పోరాడదామని గతంలో తనను కలిసినప్పుడు చెప్పానని అన్నారు. కానీ ప్రభుత్వం చేస్తోన్న అవమానాలను కోడెల భరించలేకపోయారని, విచారణ, దర్యాప్తు పేరుతో వెంటాడి వేధించారని ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?