చిత్తూరు మాజీ ఎం పి శ్రీ శివప్రసాద్ మృతి పట్ల మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంతాపం

చిత్తూరు మాజీ ఎం పి శ్రీ శివప్రసాద్ మృతి పట్ల మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.


శ్రీ శివప్రసాద్ తమ సహచర పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారని రాయపాటి గుర్తు చేసుకొన్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కాంక్షలకనుగుణంగా ఆయన తన విచిత్ర వేషధారణలతో అటు తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి, ఇటు ప్రత్యేకాంధ్ర ఏర్పాటు అనంతరం ప్రత్యేక హోదా కోసం ఉద్యమించి పార్లమెంటు దృష్టికి,యావత్తు భారతదేశ దృష్టికి సమస్య తీవ్రతను  తెలుపగలిగారని రాయపాటి పేర్కొన్నారు.


 శ్రీ శివప్రసాద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతణ్ని ప్రార్ధిస్తున్నాను.