వినాయకచవితి సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు తన అభిమానులకు శుభాకాంక్షలు

వినాయకచవితి సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


అంతేగాకుండా, ఇవాళ తన సోదరుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు కూడా కావడంతో  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలు పార్టీ కోసం రూ.100 కోట్లు విరాళాలు సేకరించాలన్న నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని, ఓ పార్టీకి ఇలాంటి అభిమానులు ఉండడం తనను నిజంగా విస్మయానికి గురిచేసిందని అన్నారు.