ఇంటిపనులు చేయడానికి వెనుకాడే పురుషులూ జాగ్రత్త.

 ఇంటిపనుల్లో సాయంచేసే పురుషుల కన్నా, సాయం చేయనివాళ్ల ఆరోగ్యం త్వరగా దెబ్బతింటున్నట్టు ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఇంట్లో పనులుచేసుకోవడం ఆడవాళ్ల డ్యూటీ అన్న భావనలో చాలామంది ఉంటుంటారు. కొందరు ఆడవాళ్లు కూడా పురుషులను ఇంటి పనులు చేయనివ్వరు. ఇద్దరం ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నాం కాబట్టి ఇంటిపనులు కూడా ఇద్దరం కలిసిచేసుకుందాం అనుకునేవాళ్లూ ఉన్నారు. ఇవెలా ఉన్నా.. వంటావార్పులో పాలుపంచుకోకపోతే మానసిక, శారీరక రుగ్మతలు తప్పవంటున్నారు సైంటిస్టులు. లండన్ యూనివర్సిటీ కాలేజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 20 వేల మంది మహిళలు, పురుషులను పరిశీలించగా ఈ అంశాలు వెలుగుచూశాయి. వీరిలో ఇంటిపనులు, తోటపని లాంటి శారీరక శ్రమచేసేవారు ఆరోగ్యంగా ఉంటున్నట్టు వెల్లడైంది. ఇలాంటి పనులంటే ఇష్టపడనివారు హృద్రోగాలు, క్యాన్సర్లతోపాటు మానసిక ఒత్తిడి వల్ల కలిగే రుగ్మతలకు గురవుతారని గుర్తించారు.