సర్పంచులు, ఎంపిటిసిలకు* రాష్ట్ర మంత్రులు *క్షమాపణ* చెప్పాలి:


 సర్పంచులు, ఎంపిటిసిలకు* రాష్ట్ర మంత్రులు *క్షమాపణ* చెప్పాలి: *ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్* గారు.

 *పెనమలూరు* నియోజకవర్గ పరిధిలో *కంకిపాడులో* కోదండ రామాలయం కళ్యాణమండపం నందు మాజీ ఎంపిపి *దేవినేని రాజా* గారి అధ్యక్షతన జరిగిన పంచాయతీరాజ్ ఛాంబర్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* గారు,
పెద్ద ఎత్తున పాల్గొన్న సర్పంచులు ఎంపిటిసిలు.

ఈ సమావేశంలో *సర్పంచులు, ఎంపిటిసిలు* మాట్లాడుతూ, కృష్ణాజిల్లా డిఆర్సీ సమావేశంలో *జిల్లా మంత్రులు* పేర్ని, కొడాలి, వెల్లంపల్లిలు, ఇంచార్జీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, సర్పంచులు, ఎంపిటిసిలు ఉపాధిహామీ నిధులతో చేసిన పనులలో *అవినీతి చేశారన్న* వ్యాఖ్యల పట్ల *తీవ్ర నిరసన* తెలిపారు. *కష్టపడి పని చేసిన* మమ్మల్ని రాష్ట్ర మంత్రులు *కించపరచి* మా *ఆత్మాభిమానాన్ని - ఆత్మగౌరవాన్ని* దెబ్బ తీశారని మమ్మల్ని *దొంగలుగా, అవినీతి పరులుగా* ప్రజలలో *అసత్య* ప్రచారం చేస్తున్నారని *తీవ్రఆవేదన* వెలిబుచ్చారు.
 *మంత్రులు* తమ వ్యాఖ్యలు *ఉపసంహరించుకునీ* మా సర్పంచులు, ఎంపిటిసిలు లకు క్షమాపణ చెప్పాలని *లేకపోతే* తగిన విధంగా *వారికి బుద్ధి చెప్తామని* హెచ్చరించారు.

ఈ సందర్భంగా *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* గారు మాట్లాడుతూ, ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి *గ్రామాలను అభివృద్ధి* చేసిన సర్పంచులను ఎంపిటిసిలను *అవినీతి చేశారని* రాష్ట్రమంత్రులు అనడం
 *సిగ్గుచేటు* అని అన్నారు.

 *ఉపాధిహామీ* నిధుల బకాయిలు *2500 కోట్లు* వెంటనే *విడుదల* చేయాలనీ, అవమానపరచిన  సర్పంచులు ఎంపిటిసిలకు *క్షమాపణ చెప్పాలని* రాష్ట్ర మంత్రులను *రాజేంద్రప్రసాద్ డిమాండ్* చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు కాసరానెని మురళీ, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ముల్లంగి రామకృష్ణారెడ్డి, పంచాయతీ రాజ్ ఛాంబర్ జిల్లా కమిటీ నాయకులు, మాజీ సర్పంచి అనుమోలు ప్రభాకర్, మాజీ సర్పంచి మాభు సుభాని, మాజీ ఎంపిటిసి సుభానీ, బొగ్గవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపిపి కోయా ఆనంద్ తదితర సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.