నాటి టిడిపి నిర్ణయాలే నేటి తెలంగాణకి ప్రాణాధారం..!

నాటి టిడిపి నిర్ణయాలే నేటి తెలంగాణకి ప్రాణాధారం..!                          చంద్రబాబు మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉన్నా సరే… ఆయనను ఏ స్థాయిలో ద్వేషించినా సరే… ఒక విషయంలో మాత్రం చంద్రబాబు ఆలోచనలను గాని ఆయన తీసుకునే నిర్ణయాలను తప్పుబట్టే అవకాశం ఉండదు. అదే పరిపాలన… చంద్రబాబు పరిపాలన విషయంలో ఇప్పటి వరకు పని చేసిన ప్రతీ ముఖ్యమంత్రి కంటే ముందే ఉంటారు. ఆయన తీసుకున్న నిర్ణయాలతో దీర్గకాలిక లాభాలు ఉండటమే దానికి ముఖ్య కారణం. ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాని ఫలితం భవిష్యత్తులో తప్పకుండా కనిపించే విధంగా చంద్రబాబు అడుగులు వేస్తూ ఉంటారు.అలా ప్రోత్సహించిన వాటిలో ఐటి రంగం ముందు వరుసలో ఉంటుంది. సరిగా 20 ఏళ్ళ క్రితం చంద్రబాబు హైదరాబాద్ లో హైటెక్ సిటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేవలం 15 నెలల్లో అయన ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి… ఐటి కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికారు. ఎవరి సహకారం ఉన్నా లేకపోయినా… ఎవరు మద్దతు ఇచ్చినా ఎవరు వ్యతిరేకించినా సరే పెరల్ సిటీని ఐటి హబ్ గా మార్చడంలో ఆ రోజు చంద్రబాబు వేసిన ఆ అడుగు దేశ చరిత్రలో కచ్చితంగా చెప్పుకునేదే. ఎవరు ఆయనపై ఎన్ని విమర్శలు చేసినా ఈ విషయంలో చంద్రబాబుని సమర్ది౦చాల్సిందే. ఆ రోజు చంద్రబాబు హైటెక్ సిటి కట్టకపోయి ఉంటే అమెరికా దాటి రాని ఎన్నో కంపెనీలకు విదేశాల్లో పెట్టుబడుల మీద నమ్మకం వచ్చి ఉండేది కాదని ఎందరో ప్రముఖులు అంగీకరించే వాస్తవం. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ కూడా అమెరికాను దాటి విదేశీ గడప తొక్కడానికి సిద్దపడిన అడుగు అది. వేలాది మంది రైతుబిడ్డలు “నాడు రైతు బిడ్డలం – నేడు ఐటి నిపుణులం” అని చెప్పుకోవడానికి హైటెక్ సిటి నిర్మాణం ఎంతగానో సహకరించింది అనేది వాస్తవం. ఇప్పుడు తెలంగాణకు ఐటి ఉత్పత్తులలో భారీగా ఆదాయం వస్తుంది అంటే…అమెరికా లాంటి దిగ్గజ దేశాలకు చెందిన కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇంకా ముందుకి వస్తున్నాయి అంటే ఇదే కారణం. ఐటి రంగంలో తెలంగాణకు భారీ ఆదాయం వస్తుంది అంటే చంద్రబాబు పుణ్యమే. అక్కడ వందల కొద్దీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి అంటే చంద్రబాబే కారణం. కంప్యూటర్ ఆధారిత ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరు కూడా చంద్రబాబు ఫోటో పెట్టుకునే అడుగు అది. దేశంలో ఐటి అంటే హైదరాబాద్… హైదరాబాద్ అంటే ఐటి అనడానికి హైటెక్ సిటి నిర్మాణమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.