మహాత్మా.. మన్నించు!* *ఆర్థిక విధానంలో ఏనాడో నీ బాట తప్పాం..*
మహాత్మా.. మన్నించు!*

 

*ఆర్థిక విధానంలో ఏనాడో నీ బాట తప్పాం..*

 

*గ్రామాల్ని గాలికొదిలేశాం.. పట్టణీకరణపైనే దృష్టిపెట్టాం*

 

*గాంధీజీ సూచించిన ఆర్థిక విధానాలు..*

 

అన్ని కరెన్సీ నోట్లపై బోసి నవ్వుల బాపూ చిత్రాన్ని ముద్రించుకున్నాం. కానీ, ఆయన సూచించిన జనహిత ఆర్థిక విధానాలను అను సరించడంలో విఫలమయ్యాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలైనా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించు కోలేకపోయాం. కోట్లాది మంది ప్రజలకు ఇప్పటికీ ఆర్థిక స్వాతం త్య్రం అందని ద్రాక్షే. భారత్‌ తనకంటూ సొంత ఆర్థిక విధానాన్ని కలిగి ఉండాలని, విదేశీ పోకడలను గుడ్డిగా అనుసరించవద్దని గాంధీ ఆనాడే చెప్పాడు. మరి మనమేం చేశాం.. గ్రామ స్వరాజ్యానికంటే పట్టణీకరణ, పారిశ్రామికీకరణకే అధిక ప్రాధాన్యమిచ్చాం. పెట్టుబడిదారీ, దళారీ వ్యవస్థను పెంపొందించుకున్నాం. 130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారత్‌లో కేవలం 25 మంది ధనవంతులు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 10 శాతానికి సమానమైన సంపద కలిగి ఉండటమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

 

*యాంత్రీకరణ*

 

దేశంలో యాంత్రీకరణ వ్యక్తుల ఆత్మగౌరవాన్ని, గ్రామ స్వీయ ఆధారాన్ని దెబ్బతీయకుండా ఉండాలి. పరిశ్రమలు కార్మిక ఆధారితమై ఉండాలి.

 

*దేశానికి అవసరమైనవి దేశీయంగానే..*

 

మన దేశానికి అవసరమైన వస్తువులను దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలి. దేశంలో తయారయ్యే వస్తువులకు దేశీయంగానే తగినం త డిమాండ్‌ ఉండాలి. విదేశీ వస్తువులను బహిష్కరించమని కాదు దీనర్థం. ఏమాత్రం లాభదాయకం కాని వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేయడం మూర్ఖత్వమే. వాటిని ఉత్పత్తి చేసే బదులు దిగుమతి చేసుకోవాలి.

 

*గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు*

 

భారత అభివృద్ధి గ్రామాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంది. గ్రామ స్థాయి నుంచి జరిగేదే అసలైన, నిలకడైన అభివృద్ధి. గ్రామాల అభివృద్ధి.