జనసేనకు తగిలిన గట్టి ఎదురు దెబ్బ ఇంకా వెక్కిరిస్తూనే ఉంది.

మిరియాల కాలమ్



జనసేనకు తగిలిన గట్టి ఎదురు దెబ్బ ఇంకా వెక్కిరిస్తూనే ఉంది.


ఓటమి వెనుక గెలుపు దాగి ఉందనే వాస్తవాన్ని  గ్రహించడం లేదు జనసేన ముత్తయి దువు నాయకులు. కొందరు శరీరానికి పుండ్లు కలుగజేయు విష కీటకాలు గా,మరికొందరు దింపుడు కళ్ళం ఆశలు వదిలేసి కాడిని  క్రింద పడేసి వెళ్లిపోవుచున్నారు.కట్టు తప్పు చున్న పార్టీని గాడిలో పెట్టే నాధుడే లేడు, సొంత ఇంటిని తగలబెట్టిన నట్టింట్లో కుంపటిలాగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు దౌర్భాగ్యంలో మహా భాగ్యంలాగా ఎన్నికయిన ఒకే ఒక్కడు mla రాపాక వరప్రసాద్  గారిని నాదెండ్ల మనోహర్ గారు అధినేత పవన్ సమక్షంలో వేదికపై అసహనంతో, అత్యంత క్రూరత్వ ముఖంతో చులకనగా చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారి సంచలన ఉప ద్రవం లాగా ముందుకొచ్చింది. గతంలో టీడీపీ పార్టీలో రామారావు ప్రక్కన కీలక తాళం చెవిగా ఉన్న  లక్ష్మీ పార్వతి లాగానే  ఇప్పుడు పవన్ ప్రక్కన నాదెండ్ల వ్యవహారశైలి కూడా ఉందని భావిస్తూ విధాన పద్ధతులకు విసుగు చెంది పార్టీకి దూరమవుచున్న నాయకులను శత్రువులుగా భవిస్తున్నారేగాని లోపాలను,తప్పులను సరిదిద్దుకుని,నష్ట నివారణ తగ్గించే ప్రయత్నాలు చేయకపోవడం అత్యంత బాధాకరం. మాటలకు చేతలకు పొంతనలేక,చెప్పే నోరు వేరుగా చేసే మనస్సు వేరుగా ఉంది.ఏదో చేయాలనే తాపత్రయం,ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కార్యకర్తల చేతులు కాళ్ళు కట్టేసి కబడ్డీ ఆడ మన్నట్లుగా ఉంది.వారిలో తెలియని అసహనంతో ఉంటున్నారు. ఒంటి చేత్తో వీరోచిత పోరాటం చేస్తున్న అధినేత పవన్ ఇప్పటికయినా మసకబారుచున్న ప్రతిష్టను కాపాడుకుని,భట్రాజు పొగడ్తలు వినకుండా ,  అతి కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను అవకాశవాదంగా తీసుకుని,ప్రజా సమస్యల పట్ల పోరాడితేనే జనసేన పార్టీకి ఉజ్వల భవిష్యత్తు.