హైదరాబాద్ లోని ఓ పురాతన భవనం కూలింది

 


హైదరాబాద్ లోని ఓ పురాతన భవనం కుప్పకూలింది. నాంపల్లిలోని రైల్వేస్టేషన్ కు ఎదురుగా ఉన్న పురాతన భవనం ఉన్నపళంగా కూలిపోయింది. భవనం వద్ద ఉన్న యాచకులకు గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.