కర్నూలుజిల్లాలో ఆళ్లగడ్డ మండలకేంద్రం నుండి గాజులపల్లి వరకు అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ యురేనియం కోసం త్రవ్వకాలు జరుపుతుంటే ప్రభుత్వం తెలిసీ తెలియనట్టు ఉండటం ఏమిటి? ప్రజల ఆందోళనను ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోదు.
యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైసీపీ నేతలు డుమ్మా కొట్టారంటే అర్థం ఏమిటి? రేపు ఆదివారం ఓబులంపల్లిలో జరిగే అఖిలపక్ష పోరాటానికి వైసీపీ మద్దతు ఉందా లేదా?
వైఎస్ హయాంలో యురేనియం ప్లాంటుకు అనుమతులిచ్చి నల్లమలకు ముప్పు తెచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగారు యురేనియం త్రవ్వకాల అంశాన్ని వినీ విననట్టు తప్పించుకు పోతూ ప్రజలకు, రైతులకూ అన్యాయం చేస్తున్నారు.