నాగార్జునసాగర్ రిజర్వాయర్‌‌ 12 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 

నాగార్జునసాగర్ రిజర్వాయర్‌‌కు సంబంధించిన 12 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 
నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.24లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి సంబంధించిన 7 గేట్లను అధికారులు ఎత్తివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 4.48లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 2.64లక్షల క్యూసెక్కులుగా ఉంది. 
 ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన 15 గేట్లను ఎత్తివేశారు.  ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 82వేల క్యూసెక్కులుగా ఉంది.  పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.8420 టీఎంసీలకు నీరు చేరుకుంది.