ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాల్సింది పోయి ప్రభుత్వం బెదిరింపులకు దిగింది

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాల్సింది పోయి ప్రభుత్వం బెదిరింపులకు దిగిందని  సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క  మండిపడ్డారు. భయపెట్టి ఆదేశిస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. సీఎం ఒక్క మాటతో ఉద్యోగాల నుంచి తీసేస్తారా? అని భట్టి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారం తలకెక్కి పరాకాష్టకు చేరిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇదేనా? అని భట్టి ప్రశ్నించారు. సకలజనుల సమ్మె సమయంలో కార్మికులపై లాఠీ విరగలేదని, ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసేయలేదని, అప్పటి సీఎం కూడా కేసీఆర్‌లా ప్రవర్తించలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.