_చిన్నజియ్యర్ గారూ... ఖరీదైన వేడుకలు ఏల..?_

*_చిన్నజియ్యర్ గారూ... ఖరీదైన వేడుకలు ఏల..?_◆ మైహోం - స్వామికి లింకేంటి..?
◆ రామేశ్వరరావు, మెఘా ఐటి దాడుల వెనుక..?
◆ రవిప్రకాశ్ గురించి మంత్రాగం..


*_ఎట్టకేలకు రాజకీయ చదరంగం మొదలైంది. చిన్నజియ్యర్ స్వామి వారికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేశారు. అసలు సర్వసంగ పరిత్యాగులకు ఈ వేడుకలు అవసరమా...? అంటే ఈ అభినవ స్వాములకు బాహ్య ప్రపంచపు జిహ్వా రుచులు ఇంకా రుచి చూడాలని అనిపించటం ఎంత వరకు సబబు. ఈ పరిణామాలు ఏ ఆధ్యాత్మికతకు గుర్తు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కొసారి టార్గెట్ ను 'ఫైరింగ్' చేస్తున్నామని, అందుకు అధికారం కూడా తోడుగా ఉంటుందని,_● పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఎన్ని రౌండ్లు కాల్చినా... ఏం కాదనే ధీమా...తో ఫైరింగ్ మొదలెడతారు. తీరా చూస్తే ఆ 'గన్' తమ గుండెల వైపే ఉందని, అది 'మిస్ ఫైర్' అయిందని తెలిసేటప్పటికే కథ చాలా దూరం వెళుతుంది. వెళ్ళింది. సరిగ్గా అలాంటి సంఘటనే... టివి9 రవిప్రకాష్, మై హోం రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డిలది. రవిప్రకాష్ ను గురి పెట్టిన తుపాకీ, మై హోం, మెఘాల వైపు తిరగటమే.. 'మిస్ ఫైర్' అయిన... బయటకు తెలియని అసలు కథ ఇది. 'ఆదాబ్ హైదరాబాద్' అందిస్తున్న ప్రత్యేక కథనం._*


*స్వామి ఈ ఆడంబరాలు అవసరమా...:*
సీఎం కేసీఆర్ మీ శిష్యుడే...ఆయనే చెపుతున్నారు.. మీకు డ్రైవర్ గా కూడా పనిచేశానని నిస్వార్థంగా వెల్లడించారు. సరే... సర్కారే మీ చెప్పుచేతుల్లో నడుస్తున్నది సరే... కానీ మీ తిరునక్షత్ర కార్యక్రమానికి ఇంత అట్టహాసమా..? అంత ఖరీదైనది మీ ఆసనమా..? శ్రీ శ్రీ శ్రీ చిన్న జియ్యర్ స్వామి వారూ... ఇదేమి తీరు..? నల్లమలుపు బుజ్జి ఇలా పువ్వులతో డిజైన్ చేశాడు... సన్యాసులకు, స్వాములకు, వైరాగులకు ఈ ఐహిక సౌఖ్యాలు, ఆడంబరాలు, విలాసాలపై మోజు ఎందుకు..? కాస్త సెలవిస్తారా స్వామీ..? తమరు ఈ సమాజానికి ఇచ్చే సందేశం భోగమేనా..? వైభవ యోగమేనా..? ఏ రామానుజుడు చెప్పారు స్వామీ ఇది..? అసలు స్వాములకు 'పుట్టిన రోజులు' ఏమిటీ స్వామీ...? అది చాంద్రమానమా..? సౌరమానమా..? ఆంగ్ల మానమా..? కాలానికి మనమే గీసిన గీతలకు ఇంత ప్రాధాన్యమా..? మీరు ఈ వయస్సులో ఐహిక భోగ, భాగ్యాలకు అతీతులు కాలేకపోయారు. భగవంతుడా... భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఇలా చూడటం కష్టంగా ఉంది.


*చిన్నజీయ్యర్... లింకుల లంకే..?:*
ఆధ్యాత్మిక ప్రపంచంలో వివాదరహితుడు. అభ్యుదయవాది. తనదైన భక్తి ప్రపంచం. ఒక కోణం. మరోకోణంలో మైహోం రామేశ్వరరావు జియ్యర్ స్వామికి ప్రథమ శ్రేణి శిష్యగణంలో అగ్రజుడు. మై హోం ఆర్థిక లావాదేవీలకు జీయర్ స్వామి ప్రవచనా కేంద్రాలు 'బిందువు'గా ఉన్నాయనే ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దీంతో బాహ్య ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది. ఇది ఇక్కడితో ఆగే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి తోడు రవిప్రకాష్ తనను పోలీసులు విచారణ చేస్తున్న సందర్భంలో చెప్పిన 'నిర్ఘాంతపోయే విషయాలు' విచారణ పరిధి సైతం లోతుగా 'అన్వేషించే స్థాయికి తీసుకెళ్ళారు. అంతకంటే ఖాకీలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. రవిప్రకాశ్ వేసిన ఉచ్చులో తెలియకుండా అందరూ ఇరుక్కున్నారని తెలుస్తోంది. ఈ వేడుకల సందర్భంగా రవిప్రకాశ్ గురించి చర్చలు జరగటం విశేషం.


*ఆ నలుగురూ...:*
జియ్యర్ స్వామి వద్ద ట్రస్టు, ఇతర కార్యక్రమాలు చూసే నలుగురు, రామేశ్వరావుల వద్ద కీలకంగా వ్యవహరించే నలుగురు వ్యక్తులు ఈ లావాదేవీల విషయంలో చురుగ్గా వ్యవహించినట్లు తెలుస్తోంది. గతంలో చిన్న జియ్యర్, మై హోం రాజేశ్వరరావుల సానిహిత్యం పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న భాజపా కొంత ఆసక్తి, అనురక్తి సహజంగా ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. అటు కేసీఆర్ కు ఇటు చిన్న జియ్యర్ కు దగ్గరగా ఉండే రామేశ్వరరావు, మెఘా ఆస్తులపై జరిగిన ఐటి దాడుల 'లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక'. ఈ దాడుల వెనుక ఉన్న అందరి భవిష్యత్తు తెరపై చూద్దాం. భూ కేటాయింపుల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. స్విమి భక్తి. 


*ఓ వెంట్రుక పీకారు... ఆయన జుట్టే పీకాడు..:*
కారణాలు ఏమైనా ఉండనివ్వండి. మైహోం, మేఘా, శ్రీనిరాజుల హవాలా చెల్లింపులపై టివి9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఈడీకి, సీబీఐకి పెట్టిన మెయిళ్లు, ఫిర్యాదులు ఫలించాయా...? అంటే ఎస్ అనే చెప్పాలి. మైహోం, మెఘా అడ్డాల మీద భారీగా ఐటీ దాడులు జరిగాయి. చాలా టీంలు ఒకేసారి దాడులు చేసి, పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. బోలెడు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికల సందర్భంగా అకౌంట్ల నుంచి మారిన 100 కోట్ల వివరాలు త్వరలోనే బహిర్గతం అవుతాయి.


*ఏం దొరికాయి..?:*
"ఆ కాగితాల మాటున జరిగిన లావాదేవీలు ప్రగతిభవన్ మూలలకూ దారితీస్తున్నాయా" అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 'షా'ఏయే కారణాలతో కేసీయార్‌ ను టార్గెట్ చేసి, మైహోం, మెఘాల మీదకు ఐటీ దళాలను నడిపిస్తున్నాడు అనేది ఓ విశ్లేషణ. ఓ చర్చ.. తరువాత వంతు అత్యంత ప్రముఖోత్తమ విద్యావేత్త మల్లారెడ్డి, ఆద్యాత్మిక వేత్త సుందర చైతన్యానందలు అనేది ఇంకో ఊహాగానం. (దాని సంగతి తర్వాత చూద్దాం) సో, ఇన్నాళ్లూ రవిప్రకాష్‌ కు తల నొప్పిని కలిగించిన మైహోం రామేశ్వరరావు , మెఘాలు అనుకోని తలనొప్పితో తలపట్టుకోబోతున్నారు. తుపాసి కేసులతో జైలు కెళ్ళి వచ్చినా...వాడు మగడ్రా బుజ్జీ.!


*ఇదో డొంక:*
రామేశ్వరరావు భక్తిగా సేవించే చినజియ్యరుడి ఆశ్రమమే అనేక అక్రమాలకు, ఈ ఆస్తులు, డబ్బుల లావాదేవీలకు అడ్డాగా మారిందనీ, తనపైనా ఐటీ దృష్టి సారించిందనీ ప్రచారం జరుగుతున్నది.
ఐతే మైహోం, మెఘాలు అంత ఈజీగా దొరికిపోయేలా అడ్డదిడ్డంగా లావాదేవీలు నడిపే సంస్థలం కావు. అన్ని జాగ్రత్తలతోనే వ్యవహరిస్తుంటాయి. అందుకే ఈరోజుకూ తమ దాడుల్లో ఏం జరిగిందో..? ఐటీ వెల్లడించ లేకపోయింది. 'ఆ స్థాయిలో మేనేజ్ చేశారా..?' అనే గుసగుసలు ఉన్నాయి. కానీ అందరి అటెన్షనూ రవిప్రకాష్ మీద నుంచి, శివాజీ మీద నుంచి మైహోం రామేశ్వరరావు, మెఘా కృష్ణా రెడ్డిలపైకి మళ్లిందనేది నిజం. మోడీని గుడ్డిగా నమ్మేసి, రాజనీతిజ్ఞుడు కేసీయార్ అంత అజాగ్రత్తగా ఉంటాడనేదీ అబద్ధమే. పైగా మోడీ కుర్చీ లాగేయటానికి ప్రయత్నించిన తను, 'ఒకవేళ తననుకున్నది సక్సెస్ కాకపోతే, మోడీ తనను ఎలా సాధించటానికి, సతాయించటానికి ప్రయత్నిస్తాడు' అని కేసీయార్ అంచనా వేసుకోలేరా..? వేసుకోలేదా…? కాకపోతే కొంతకాలం ఈ దోబూచులాట ఉంటుంది. బయట ప్రచారంలో ఉన్నట్టు మోడీ...... కేసీయార్, మైహోం, మెఘా, జియ్యర్‌ లను ఫిక్స్ చేయగలడా..? అంతకుముందు చంద్రబాబును జైలుకు పంపిస్తామని బీరాలు పలికీ పలికీ ఏమీ చేయలేక పోయింది మోడీ టీం. ఇక ఎప్పుడూ ఒంటికి క్వింటాల్ ఆముదం పూసుకుని ఉండి, ఏ పరిస్థితి వచ్చినా, ఇట్టే తప్పించుకోగల ఘటనాఘటన సమర్థుడు కేసీయార్‌ ను అంత ఈజీగా 'బుక్' చేయగలడా మోడీ. సారీ మన కేసీఆర్ ఘఠనాఘట సమర్థుడు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా..!


*ముందే చెప్పిన 'ఆదాబ్':*
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ 'టివీ9 డీల్... 294 కోట్లు ఎక్కడ..?' అనే విశ్లేషణ కథనం 'ఆదాబ్ హైదరాబాద్' మాత్రమే జూన్15, 2019 కథనం అందించింది. ఇదే విషయాన్ని రవిప్రకాష్ ఆయుధంగా మల్చుకుంటాడని కూడా చెప్పింది. దీనికి తోడు రవిప్రకాష్ 'టివి9 కలల సామ్రాజ్యం' నుంచి అర్థంతరంగా పంపిన వారిని వదలడని కూడా చెప్పింది. ఈ విషయంలో స్థానిక పోలీసుల వైఖరి ఒకవిధంగా ఉండగా... ఐటి శాఖ కోణం మరోలా ఉంది. దీంతో కేంద్రం కనుసన్నల్లో 'మై హోం', మేఘా లింకుల లంకే కదులుతోంది.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో