అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

 


అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘంతో పాటు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య పిలుపునిచ్చాయి. ఎస్‌బీఐ ఈ సమ్మె పిలుపుపై స్పందించింది. ఈ సమ్మెలో పాల్గొనే ఉద్యోగులు తక్కువ మందేనని, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యధావిధిగా సేవలందిస్తామని ఎస్‌బీఐ బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు.