గోశాలకు *25,000 /- రూపాయల విరాళాన్ని అందించారు


గారపాటి ఓం ప్రకాష్ ముత్యుకళ, దంపతుల కుమారుడు చర్వణ్, కుమార్తె వేదాన్షి పుట్టినరోజులు పురస్కరించుకొని స్థానిక మోబర్లీపేట బందా సుబ్రహ్మణ్యం భవనంలో గల గోశాలలో *25,000 /- రూపాయల విరాళాన్ని అందించారు.*
*కీర్తిశేషులు గంగాబత్తుల సత్యన్నారాయణమ్మ, మంగరాజు దంపతుల జ్ఞాపకార్ధం కుమారుడు రాంబాబు 10,000 /- పోతురాజు సత్యభారతి 5,000/-, యాళ్ల రాంమనోహర్ 5,000/-,  వంటెద్దు స్వామినాయుడు (బాబ్జీ) 5,000/-, మోటూరి సత్యంకాపు ఉప్పలగుప్తం 5,000/-, దామోదర సుబ్బారావు రాజమండ్రి 5,000/- విరాళాన్ని అందించారు.* కాగా ఆశ్వీయుజ మాసం ఆదివారం అమావస్య 12 : 23 గంటల నుండి అఖండ ధూమావతి హోమం ప్రారంభమై సోమవారం మధ్యహాన్నం 12 : 30 మహాపూర్ణాహుతో ముగుస్తుంది, కావున భక్తులు హాజరుకావలిసినదిగా గోశాల వ్యవస్థాపకుడు రామకృష్ణ తెలిపాడు.