‘వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు

ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 'వైఎస్సార్‌ కంటి వెలుగు' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగ న్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే సభలో ఈ పథకాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమం కింద ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆరు విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రజలకు ఉచితంగా సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.