ఈ ఏడాది ఇప్పటి వరకు 14.93 కోట్ల ఉపాధి హామీ పని దినాలు

 


ఈ ఏడాది ఇప్పటి వరకు 14.93 కోట్ల ఉపాధి హామీ పని దినాలు.
- 2018-19 లో 16.78 కోట్ల పని దినాలు
- ప్రతి నియోజక వర్గంలోనూ మెటీరియల్ కంపోనెంట్ ద్వారా రూ. 10 కోట్ల మేరకు అభివృద్ధి పనులు
- మురుగునీటి శుద్ది కోసం రూ. 3 నుంచి రూ. 5 కోట్లు కేటాయింపు
- మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి హామీ కూలీల పనిదినాలు 2018-19లో 16.78 కోట్లు కాగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 14.93 కోట్ల పని దినాలు కల్పించడం జరిగినదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రతి నియోజక వర్గంలోనూ మెటీరియల్ కంపోనెంట్ ద్వారా 10 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి పనులను చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. అలాగే లిక్విడ్ వాటర్ వేస్ట్ మేనేజిమెంట్ కింద మురుగు కాలువల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ కోసం, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. దీని కోసం జనాభా ప్రాతిపదికన రూ. 3 నుంచి రూ. 5 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు.