38 రోజుల క్రితం గల్లంతైన పర్యాటక బోటును బయటకు తీశారు

 


తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు గ్రామ సమీపంలో సరిగ్గా 38 రోజుల క్రితం గల్లంతైన పర్యాటక బోటును కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఎట్టకేలకు బయటకు తీసింది. ఈ దుర్ఘటనలో లభ్యం కాని 12 మృతదేహాల్లో ఐదు మృతదేహాలను ఇప్పటివరకూ గుర్తించారు. దాదాపు ఘటన జరిగి 38 రోజుల కావడం, ఇన్ని రోజులుగా నీళ్లలో నానిపోయి ఉండటం వల్ల మృతదేహాలు గుర్తించలేని విధంగా ఉన్నాయి. బోటులో మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లు భావిస్తున్నారు.