ఏస్ బి ఐ ఏటీఎంల నుంచి ఇకపై రూ. 2,000 నోటు రాదు. 

 


భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సూచన మేరకు  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి చెందిన ఏటీఎంల నుంచి ఇకపై రూ. 2,000 నోటు రాదు.   ఇందులో భాగంగా రూ. 2 వేల నోట్లను ఉంచే క్యాసెట్లను దాదాపు అన్ని ఏటీఎంల నుంచి తొలగించింది. మున్ముందు రూ.500 నోటును కూడా ఆపేసి.. కేవలం రూ.100, రూ. 200 నోట్లతోనే ఏటీఎం లావాదేవీలు జరిగేలా చూసేందుకు ఎస్‌బీఐ యోచిస్తోంది. కాగా చిన్ననోట్లు మాత్రమే లభ్యం కానుండటంతో వినియోగదారుల సౌకర్యార్థం ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని పెంచే దిశగా బ్యాంకు సన్నాహాలు చేస్తోంది. మెట్రో నగరాల్లో 10 సార్లు.. ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఉచితంగా ఏటీఎం నుంచి నగదు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది.