*ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోదకం ... 'ధ్యానం' తో సుసాధ్యాం..!!*
నానాటికీ మనిషి అనవసర కలుషితాలకు బానిసై అదుపు తప్పిన ఆలోచనలు చేస్తూ...
అశాంతి, అనారోగ్యంతో పాటు తనకు తాను భారమై భూమికి భారంగా తయారవుతున్నాడు.
మనిషి భూమికి మోయలేని భారం అవుతున్న ప్రతి సందర్భం లోనూ ప్రకృతి ప్రకోపాలకు బలి అవుతూనే ఉంది.
జీవరాశులన్నింటినీ సదా కాపాడడం ప్రకృతి సహజ లక్షణం. కానీ మనిషి అడుగు అడుగునా ప్రకృతి సహజ జీవనానికి విరుద్ధంగా, అసహజంగా, స్వార్థపూరితంగా ఆలోచిస్తూ.. ప్రకృతి సహజ సిద్ధ వనరులను వినియోగం విస్మరించి.. అతిగా వ్యవహరించి చేజేతుల విపరీత వైపరీత్యాలను కొనితెచ్చుకుంటున్నాడు.
*ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే .. ఆ యొక్క ప్రకృతే మనల్ని సదా రక్షిస్తుంది అన్నది పరమ సత్యం.* అందుకే ఈనాటికి భూటాన్, ఆఫ్రికా మొదలగు దేశాలు మొక్కలను దేవతలుగా భావిస్తారు. ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి హాయిగా జీవిస్తున్నారు. ఎక్కడ అయితే సహజ వనరులను పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటున్నామో అక్కడ అక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరగడం మనం గమనించాలి. ముఖ్యంగా వనాల నిర్మూలన, జంతు బలులు, సహజ అటవీ సంపదను నాశనం చేసుకోవడం, జలవనరులను దుర్వినియోగం చేసుకోవడం వలన ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా మానవజాతిని అతలాకుతలం చేస్తున్నాయి.ఇటువంటి సకల అనర్థాలకు మూలం .. మనిషి యొక్క సరికాని ఆలోచనలు..
ఎవరైతే సరైన ధ్యాన సాధన చేస్తారో వారికి సరి అయిన ఆలోచనలు ఉత్పన్నమవుతాయని తద్వారా ప్రకృతితో సహజంగా జీవించడం నేర్చుకుంటారు. ఆలోచన రహిత స్థితి వలన ప్రతి ఒక్కరూ మొదట *అభారంగా* మారతారు. వారి ఆలోచనలు, ఆహారం మరి వ్యవహారం ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా మారి క్రమేపి వారు భూమికి *ఆభరణంగా* మారుతారు.
హిమాలయ పరిశోధకులు, యోగులు, ఆధునిక పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రకృతి వైపరీత్యాల పై జరిపిన తాజా పరిశోధనలు అన్న ఒక్క విషయం తేటతెల్లంజేసాయి.
భూమిని రక్షించుకోవాలంటే, ప్రకృతి వైపరీత్యాలు నివారించాలంటే, వైపరీత్యాలు జరగకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రకృతి పరిరక్షణకు సామాజిక భాద్యతగా అందరూ శాకాహారులు కావాలి. ధ్యానులు కావాలి. అన్నది తక్షణ కర్తవ్యంగా భావించాలి.. వీటితోపాటు స్వచ్ఛ భారత్, నీరు - మీరు, మనం - వనం వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రకృతి విపత్తుల నివారణకు, కాలుష్య నివారణకు ఎంతగానో దోహదపడతాయి.
ప్రతి ఒక్కరికి ప్రకృతి, పర్యావరణంపట్ల సరైన అవగాహన కల్పించడం కోసం ప్రతీ ఏట *అక్టోబర్ 13* న *"ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం"* జరుపుకుంటున్నాం.
*ప్రకృతి పరిరక్షణ .. ధ్యానం వల్లనే సాధ్యం* అన్న అంశం పై స్థానిక మంగళపాలెం, ధ్యానానంద నిలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో *హిమాలయ తత్వదర్శి ధ్యానరత్న నందప్రసాదరావు* పాల్గొని తన సందేశాన్ని, ధ్యానుల బాధ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.