కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇడ్లీ ఈటింగ్ కాంపిటీషన్‌ను మహిళలకు నిర్వహించారు. ఒక్క నిమిషంలో ఎవరైతే ఎక్కువ ఇడ్లీలు తింటారో వారే విజేత. అయితే ఈ కాంపిటీషన్‌లో 60 ఏళ్ల వృద్ధురాలు ఒక నిమిషంలో ఆరు ఇడ్లీలను తినేసి విజేతగా నిలిచారు. ఇడ్లీని తినేందుకు సాంబారు కూడా ఇచ్చారు. ఈ పోటీల్లో విజయం సాధించిన సరోజమ్మను నిర్వాహకులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.