ఆడపిల్ల తండ్రికి వందనం*

*ఆడపిల్ల తండ్రికి వందనం*


ఒకరోజు ఒకతండ్రి తన కూతురుతొ ఒక చిన్న వాగును దాటుతున్నాడు. ఆసమయంలో తండ్రికి చిన్న సందేహం కలిగింది. ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమవుతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు...


*"చిన్న తల్లీ...* నా చేయి గట్టిగా పట్టుకొని నడువు. అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావు"...


అప్పుడు ఆ పాప ఇలా అంది.
*"లేదు నాన్న... మీరే నాచేయి పట్టుకోండి."* అపుడు ఆతండ్రి ఆశ్చర్యంగా ఆపాపని "నేను చెప్పింది కూడా అదే కదమ్మా! రెండింటికి తేడా ఏమిటి" అని అడిగాడు. అప్పుడు ఆపాప ఇలా చెప్పింది... 


*"చాలా తేడా ఉంది నాన్న"...*   నేను మీ చేయి పట్టుకొని నడిస్తే ఏ కారణంగా అయినా నేను మీ చేయి వదలవచ్చు. కానీ మీరే నా చేయి పట్టుకొని నడిస్తే ఎంత పెద్ద కారణంగా అయినా సరే, ఏ పరిస్థితిలోనైనా, ఏమి జరిగినా సరే మీరు మాత్రం నా చేయి వదలరు అని నమ్మకంగా తండ్రితో చెప్పింది...


వెంటనే ఆతండ్రి పాపని హత్తుకొని *"నువ్వు నా బంగారు తల్లివిరా...* నేను ఏమైనా సరే నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను" అని అన్నాడు...


అప్పుడు ఆ పాప "ఆ విషయం నాకు తెలుసు... అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే... నువ్వు మాత్రం నన్ను నీగుండెలో పెట్టుకొని జీవితాంతం మోస్తావు. ఎందుకంటే నువు *"నాన్నవి నాన్న"* అన్నది. 


*ఆడ పిల్లని కన్న ప్రతి తండ్రికి అంకితం*


Popular posts
టి ఆర్ ఎస్ కి ఆదరణ పెరుగుతుంది
Image
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కె డి సి సి బ్రాంచ్ ప్రారంభం