గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి దసరా శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశి   దసరా శుభాకాంక్షలు తెలిపారు. .  తాను నటించిన సైరా నర్సింహారెడ్డిసినిమాను చూడాలని చిరంజీవి, గవర్నర్‌ను కోరారు. తాను సైరా సినిమా చూడాలనుకుంటున్నట్టు గవర్నర్‌ తెలిపారు.

 

మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా` సినిమా తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం విడుదలైంది.  విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది గవర్నర్‌కు తెలిపారు. . విడుదలకు ముందు `సైరా`కు వచ్చిన బజ్ చూసి తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.