జూపూడికి అధికారమే పరమావధి

జూపూడికి అధికారమే పరమావధిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీలోనే జూపూడి ఉంటారని ఎద్దేవా చేశారు. గడ్డి ఉన్న చోటకు గొర్రె పరుగులు పెట్టినట్లు జూపూడి వైఖరి ఉందన్నారు. గతంలో దళిత పులిని అంటూ ప్రకటన చేసుకుని నేడు ఆ దళితులను వంచిస్తూ.. వైసీపీలో చేరారన్నారు. 'జగన్‌ కాలకేయుడు, ప్రమాదకరమైన విషం' అంటూ గతంలో జూపూడి విమర్శించారని గుర్తుచేశారు. జగన్‌ ఓ సైకో.. అందుకే వైఎస్ దూరంగా ఉంచారని నాడు జూపూడి వ్యాఖ్యానించిలేదా?, నేడు అలాంటి జగన్ చెంతకు జూపూడి చేరడం అవకాశవాదానికి నిదర్శనమని చెప్పారు. జైలుకు వెళ్లొచ్చిన వారంతా ఉద్యమకారులు కాదనే విషయం జూపూడి గుర్తించాలని హితవు పలికారు. జగన్‌ ఏ కారణంగా జైలుకు వెళ్లారో ప్రజలందరికీ తెలుసన్నారు. జూపూడి పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా పదవుల కోసమేనన్నారు. రంగులు మార్చడంలో జూపూడి ఊసరవిల్లితో పోటీపడుతున్నారని సైటర్ వేశారు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం