టీడీపీ పొలిట్‌బ్యూరోలో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. కొత్తగా ముగుర్గు సభ్యుల్ని పొలిట్‌బ్యూర్‌లోకి తీసుకుంటున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నాయకులు గల్లా జయదేవ్, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. కాగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రానున్న సంస్థాగత ఎన్నికలు, పార్టీ కమిటీలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.
టీడీపీ కొత్తగా ముగుర్గు సభ్యుల్ని పొలిట్‌బ్యూర్‌లోకి