అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు


అంగన్ వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండగ నేపథ్యంలో అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడిగిన వెంటనే అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల కోసం నిధులు విడుదల చేయడంపై గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెల మాసాంతంలో వేతనాలు అందుతున్నాయి. అయితే ఈ నెలలో దసరా పండగ మొదటి వారంలోనే రావడంతో వేతనాలు లేకపోవడం వల్ల పండగకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని తెలంగాణ అంగన్ వాడీ సంఘం నేతలు మంగళవారం(01.10.2019) నాడు మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి వేతనాలు ఇప్పించాలని కోరారు. అంగన్ వాడీల విజ్ణప్తిని మంత్రి సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. వెంటనే స్పందించిన సిఎం ఉద్యోగులకు వేతనాల కోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రి(01.10.2019) అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల నిమిత్తం 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాలు అందనున్నాయి. 


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి