అపార్టుమెంటులో నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రంపై బాలాజీనగర్ పోలీసులు శనివారం దాడి చేశారు. నిర్వాహకురాలు, విటుడు, మరో ముగ్గురు యువతులు(సెక్క్ వర్కర్ల)ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య ఆ వివరాలను తెలిపారు. హరనాథపురం పీపుల్స్ పార్కు సమీపంలోని డేగ అపార్టుమెంటులో డీ శాంతమ్మ అలియాస్ రాజమ్మ ఓ ఫ్లాటు అద్దెకు తీసుకుని కొంత కాలంగా వ్యభిచార కేంద్రంగా నిర్వహిస్తోంది. జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి అందమైన యువతులు, మహిళలను తీసుకువచ్చి నిర్వహిస్తున్న ఈ వ్యభిచార కేంద్రంపై బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్‌ఐలు పవన్‌కుమార్, వీర ప్రతా్‌ప సిబ్బందితో కేంద్రంపై నిఘా ఉంచారు. శనివారం పక్కా సమాచారంతో వారు ఆ కేంద్రంపై దాడి చేశారు. నిర్వాహకురాలు శాంతమ్మ, విటుడు కలువాయి మండలం తోపుగుంట అగ్రహారానికి చెందిన పెంచలయ్య, ముగ్గురు సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 4,800 నగదు, మొబైల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం నిర్వాహకురాలు, విటుడిపై కేసు నమోదు చేశారు. యువతులను హోంకు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు పవన్‌కుమార్, వీరప్రతాప్, ఏఎ్‌సఐ కే వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడి