చిరంజీవి తన నట విశ్వరూపాన్ని చూపించి ఎన్నోప్రశంసలు
చిరంజీవి సినీమా ల్లో లోని మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు చిరంజీవి తనయుడు రామ్ చరణ్. కాగా ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా టాలీవుడ్ లో మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది . అయితే ఈ సినిమాలో చిరంజీవి తన నట విశ్వరూపాన్ని చూపించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ప్రశంసలు దక్కాయి.