తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే డిమాండ్‌తోపాటూ... మరో 20కి పైగా డిమాండ్లతో సమ్మెకు దిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు.... దీంతో... తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు ప్రజలతోపాటూ... రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు, సంస్థలు మద్దతు ఇచ్చాయి. ఇదే సమయంలో... ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసులు కూడా ఇవాళ సమ్మెకు దిగాయి. రెండున్నర నెలలుగా సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ ప్రకటించింది. అందువల్ల ఇవాళ తెలంగాణలో బస్సులు, క్యాబ్ సర్వీసులు నడిచే పరిస్థితి లేదు. ఆటో యూనియన్లు కూడా బంద్‌కి సహకరిస్తామని తెలిపాయి. హైదరాబాద్‌లో 50వేల క్యాబ్ సర్వీసులు, లక్ష దాకా ఆటోలున్నాయి. ఇవాళ ఇవన్నీ నడవకపోవడం ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉన్నా... తమ సమస్యల్ని అర్థం చేసుకొని... బంద్‌కి ప్రజలంతా సహకరించాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. జీతాలు చెల్లించాలని, చర్చలు జరపాలనీ... స్వయంగా హైకోర్టు సూచించినా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడాన్ని బట్టీ... ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరిస్తోందో చూడాలన్న జేఏసీ... సర్కార్ మెడలు వంచేందుకే బంద్ తలపెట్టినట్లు తెలిపింది.
15 రోజులుగా సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ జేఏసీతో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదు. శుక్రవారం హైకోర్టు చర్చలు జరపాలనీ, ఇవాళ 10న్నర లోపు చర్చలు మొదలవ్వాలని కోరింది. ప్రభుత్వం మాత్రం హైకోర్టు తమను ఆదేశించలేదనీ, సూచన మాత్రమే చేసిందని భావిస్తోంది. హైకోర్టు సూచనల్ని తప్పనిసరిగా పాటించాలని రూలేమీ లేదని భావిస్తున్న ప్రభుత్వం చర్చలు జరపాల్సిన అవసరం లేదని డిసైడైనట్లు తెలిసింది