వెంకటాచలం ఎంపిడివో సరళ గారు నాపై అసత్య ఆరోపణలు చేశారు

 ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్


- వెంకటాచలం ఎంపిడివో సరళ గారు నాపై అసత్య ఆరోపణలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది


- నేను ఎంపిడిఓ ఇంటిపై దాడి చేశానని చెప్పినప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి


- కానీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఇంటికి వెళ్ళింది


- చట్టానికి ఎవరు అతీతులు కాదని సీఎం జగన్ గారు చెప్పారు


- ఆయన మాటలకు నేను గౌరవం ఇస్తున్నా, హర్షిస్తున్నా


- గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో, ఐపీఎస్ అధికారులపై దాడి చేస్తే రాజీ చేశారు


- మాది నిజమైన ప్రభుత్వం, జగన్ గారు చేసిన ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటించాడు


- జిల్లా ఎస్పీకి నాకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి, ఇది నా దురదృష్టం


- నాలుగు రోజుల క్రితం కలెక్టర్ కి ఎస్పీపై ఫిర్యాదు చేశా


- ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని సీఎం చెబితే ఎస్పీ వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేసారు


- అర్ధరాత్రి నా ఇంటిపై, శ్రీకాంత్ రెడ్డి ఇంటిపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారు


- ఎంపిడివో సరళ పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు కాకాణి అనుచరుడు ప్రదీప్ రెడ్డి పోలీసులను దారుణంగా మాట్లాడారు


- స్టేషన్ లో ప్రదీప్ రెడ్డి మాట్లాడిన మాటలకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు


-  మా బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో లే ఔట్ వేసాడు


- ఆ లే ఔట్ కు నుడా, రేరా అనుమతులు ఖచ్చితంగా ఉన్నాయి


- లే ఔట్ కు కుళాయి కనెక్షన్ ఇవ్వాలని రెండు నెలలుగా ఎంపిడిఓని అడుగుతున్నా పట్టించుకోలేదు


- ఎంపిడివో సరళ నాకు ఇవాళ కాదు, 20 ఏళ్లుగా తెలుసు


- ఆవిడకి ఫోన్ చేసి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అడిగితే మా ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దని చెప్పాడు అని సమాధానం చెప్పింది


- నేను మా బావ అయిన ఎమ్మెల్యే కాకాణికి ఫోన్ చేసి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అడిగా


- నీకు తెలీదు శ్రీధరా, ఇప్పుడు కుదరదు అన్నాడు, అంతటితో నేను సైలెంట్ ఐపోయా


- జగనన్నా ఇక్కడ పక్షపాతంగా విచారణ జరిగింది


- నా పట్ల, శ్రీకాంత్ రెడ్డి మీద కక్ష పూరితంగా పోలీసులు వ్యవహరించారు


- గత ప్రభుత్వ హయాంలో కొంతమందిలా నేను చీకట్లో చంద్రబాబు కాళ్ళు పట్టుకోలేదు


- నాకు చాలా అనుమానాలు ఉన్నాయి జగనన్నా 


- అటు కాకాణి అనుచరులతో పాటు ఇటీవల నేను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేయమని నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలకు వెళ్ళా


- వాళ్లపై నాకు అనుమానాలు ఉన్నాయి


- ఎంపిడిఓ ఇచ్చిన ఫిర్యాదులో నిజాలు ఉన్నాయని నిగ్గు తేలిస్తే నన్ను వెంటనే సస్పెండ్ చేయండి జగనన్నా


- షోకాజ్ నోటీసులు కూడా అక్కర్లేదు, శాశ్వతంగా బహిష్కరించండి


- ఉద్యోగులారా.... మీరు బహిరంగ విచారణకు నన్ను పిలవండి, నేను సిద్ధం..


- నేను ఆవిడ ఇంటిపై దాడికి పాల్పడ్డానని నిరూపిస్తే సరళ గారికి క్షమాపణ చెబుతా


- నిజం అని తేలితే సరళ గారి తల్లి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబుతా


- నాకు పోరాటాలు కొత్తకాదు, ప్రజా ఉద్యమంలో పుట్టా, ప్రజా ఉద్యమంలోనే చస్తా


- కొన్ని మీడియా సంస్థలు, ప్రతినిధులు నన్ను వేధిస్తున్న మానసిక క్షోభకు ఆత్మహత్య చేసుకోవలనిపిస్తుంది


- నాకు మద్యం తాగే అలవాటు లేదు అని వందసార్లు చెబుతున్నా నమ్మరా


- నేను నిద్రపోవడం కోసం టాబ్లెట్స్ మాత్రమే వాడుతా


- నా స్నేహితులు, నా సన్నిహితులు, కార్యకర్తల కోసం ఎంత దూరమైన పోరాడుతా


- రూరల్ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తా