దసరా ఆత్మీయ సమ్మేళనం 'అలయ్ బలయ్'ను ఈ సారి కూడా ఘనంగా నిర్వహించనున్నారు. అక్టోబరు 10న నక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బిశ్వభూషణ్ హరిచందన్, బండారు దత్తాత్రేయతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఈ విషయాన్ని బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 'అలయ్ బలయ్'ను దత్తాత్రేయ.. 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
దసరా ఆత్మీయ సమ్మేళనం 'అలయ్ బలయ్' ఘనంగా అక్టోబరు 10న