హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌ కే సానుకూలం

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికకు సంబంధించి అంతర్గత సర్వేలన్నీ కూడా టీఆర్‌ఎస్‌కు సానుకూలంగా ఉన్నాయని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇంటింటి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. శనివారం ఆయన ఉప ఎన్నికకు సంబంధించి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్‌ దగ్గర అంశాలేవీ లేవని కేటీఆర్‌ అన్నారు. ఈ ఎన్నికలతో బీజేపీ బలమేంటో తేలిపోతుందని పేర్కొన్నారు. బీజేపీకి డిపాజిట్‌ దక్కితే అదే గొప్పఉపశమనం అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఓడిపోతామని తెలిసీ కాంగ్రెస్‌, బీజేపీ దొంగ రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్‌ విమర్శించారు.