ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ మరోసారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు


రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ మరోసారి ఉదార . చిన్నారులు, మహిళలకు సాంఘిక దురాచారాల నుంచి విముక్తి కల్పిస్తున్న ప్రజ్వల స్వచ్ఛంద సంస్థకు చేయూతనందించారు. ఈ సంస్థకు చెందిన వాహనం రెండువారాల క్రితం చెడిపోయిందని.. దాతలు సాయంచేయాలని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు సునీతాకృష్ణన్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్‌పెట్టారు. అనుషారెడ్డి అనే నెటిజెన్ దీనిని స్క్రీన్‌షాట్ తీసి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. మంగళవారం తన కార్యాలయంలో సునీత కోరినట్టుగా వాహనం కొనుగోలుకు అవసరమైన సొమ్మును చెక్ రూపంలో అందించారు.