పరిశోధన పాత్రికేయుడిపై
*కుట్ర కేసు బట్టబయలు*
◆ ఆడియోలో బయటపడ్డ అసలు బాగోతం
◆ ట్రాప్ చేశానని ఒప్పుకున్న సంకసర్ల సువర్ణ
◆ బద్నాం చేయటమే అసలు ఉద్దేశ్యం
◆ నీతులు చెప్పేస్తున్న నిందితులు
◆ ఇది ఐడెంటిటీ క్రైసెస్: డాక్టర్ రెడ్డి
అవినీతి, అన్యాయాలపై ధైర్యంగా పోరాడుతున్న పరిశోధన పాత్రికేయుడిపై జరిగిన కుట్ర కేసు బట్టబయలైంది. పకడ్బందీగా వేసిన పథకం, అంతా ఓకే అనుకుంటూ... సరిగ్గా చేయకూడని తప్పులు చేసి నిటారుగా దొరికారు. అసంబద్ద, అశ్లీల, నిరాధార ఆరోపణలతో గంగవెర్రులతో ఉర్రూతలు ఊగారు. చివరకు కాల్ లీస్ట్ దగ్గర నుంచి ప్రతి విషయంపై లోతుగా వెళ్ళటం జరిగింది. ప్రతి విషయాన్ని ఆధారాలతో సహా సంపాదించడం జరిగింది.
అసలేం జరిగింది:
సంకసర్ల సువర్ణ సుమారు రెండు నెలల క్రితం సామాజిక మాధ్యమాలలో తనను లైంగికంగా వేధించారంటూ ఓ పరిశోధన పాత్రికేయుడిపై ఆరోపణలు గుప్పించారు. అయితే ఆడియో ఎక్కడా బయటపెట్టకుండా.. దళిత మహిళ అంటూ ఆడియో సంభాషణలలో లేని కథలు అల్లడం జరిగింది. దీంతో కొందరు విషయం ఏమిటో కూడా ఆలోచించకుండా అవాకులు, చెవాకులు పేలారు. అయితే ఈవిషయంపై జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధారాలతో రాష్ట్ర డిజిపిని కలసి సంకసర్ల సువర్ణ, పట్నాయక్, మరో వ్యక్తి పై ఫిర్యాదు చేసింది. ఇది కొందరు 'డబ్బా నాయళ్ళ'కు లేని దురద పుట్టి తలంతా మీదేసుకొని వచ్చారు. పట్నాయక్ అనే వ్యక్తి తనకు తోచిన పిడిఎఫ్ ఫైళ్ళు అసభ్యంగా అప్ లోడ్ చేశాడు. మళ్ళీ మరొకటి.. ఇలా దిగజారాల్సినంత దిగజారుడు. ఇంతలో సైబర్ క్రైంకి అందిన ఫిర్యాదు వెలుగులోకి రావడంతో సువర్ణ ఓ వీడియో విడుదల చేసింది... కానీ అసలు ఆడియో బయటపెట్టకుండా జాగ్రత్త పడింది. అనంతరం న్యాయ సలహా మేరకు ఆ పాత్రికేయుడు వీడియో విడుదల చేసి జరిగిన కుట్ర వివరించారు. ఆడియో బయట పెడతానని చెప్పడంతో... పట్నాయక్
ఆడియో విడుదల చేసి సరిగ్గా దొరికారు. ఈ ఆడియోలో ఎక్కడా అశ్లీలత కానీ, అసభ్యంగా కానీ.. దళిత అనే పదాలు లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని 'గుడ్డ కాల్చి మీద వేయడంలో ముదిరిన ఇంకో తప్పులోడు రంగంలోకి దిగి రంకెలేశాడు. ఈ సందర్భంగా నల్లి శ్యాం అనే మరో వ్యక్తి (నల్గొండ ఎస్పీకి చాలా దగ్గరని ఫొటోలు పెడుతుంటాడు. 'నల్గొండ దాష్టీకం'లో మరోసారి తప్పక చర్చిద్దాం. ఇతని గురించి గతంలో చాలా అవకతవకలు, ఇతర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇల్లు, ఇతర వివరాలు ..తర్వాత తప్పక చెప్పుకుందాం.)
అయితే సంకసర్ల సువర్ణ 'తాను ట్రాప్ చేశానని' వాట్సప్ ఛాటింగ్ లలో సగర్వంగా చెప్పింది. ఒప్పుకుంది. ఆధారాలున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 420 ఛీటింగ్ కేసు ఎదుర్కొంటున్న ఈవిడ...ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టగలిగింది. అయితే ఈమె తాను క్రిస్టియన్ అని చర్చికి వెళతానని పేస్ బుక్ లో స్వయంగా చెప్పింది. (ఆధారాలు ఉన్నాయి).
ఇది ఐడెంటీ క్రైసెస్- డాక్టర్ రెడ్డి
చాలామంది వ్యక్తులు సమాజంలో లేని విషయాలను ఊహించుకుంటూ ఎదుటి వ్యక్తులపై బురద జల్లి... తమకు గహవచ్చే.. తాత్కాలిక గుర్తింపు కోసం పాకులాడతారని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.
(వరుస కథనాలలో... హైకోర్టులో అరుదైన కేసు, ఆదేశాలు ఏం ఇచ్చింది. తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై ఎలాంటి కేసులు పెట్టవచ్చు, కాల్ లీస్ట్ కథనం..).
. హైకోర్టులో ఏం జరిగింది..