ఉపాధిహామీపథక చట్టాన్ని నిర్వీర్యం చేయడం ప్రభుత్వ పక్షపాతమే :


ఉపాధిహామీపథక చట్టాన్ని నిర్వీర్యం చేయడం ప్రభుత్వ పక్షపాతమే :


ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్.

 *నందిగామ నియోజకవర్గంలోనూ, జగ్గయ్యపేట నియోజకవర్గం* లోనూ. సర్పంచులు, ఎంపిటిసి లు ఎంపిపీలు జడ్పీటిసి లతో విడివిడిగా సమావేశమైన *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* గారు.

నరేగా ద్వారా విడుదలైన *2000కోట్ల* రూపాయల నిధుల బకాయిల చెల్లింపులో,
ఆ నిధులను దారి మళ్లించి తన స్వంత అవసరాలకు వాడుకున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా  ఉద్యమకార్యాచరణ గురించి చర్చించినారు. 

ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపు మేరకు నవంబర్ 5 నుండి 15 వరకూ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని *ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్* గారు అన్నారు.

ఉపాధిహామీ పథకం ద్వారా  గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వం, పక్షపాత వైఖరితో అవగాహనా లోపంతో రాబోవు నిధులను కూడా అడ్డుకుంటుంది అని *అని బాబూ రాజేంద్రప్రసాద్* గారు తెలిపారు,
రాజకీయాలకు అతీతంగా బలమైన ఉద్యమ కార్యాచరణ ద్వారా నిధులు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి రామకృష్ణారెడ్డి, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి వెల్ది శ్రీను, మాజీ జడ్పీటిసి కోగంటి బాబూ, మాజీ సర్పంచ్ తంగిరాల పద్మావతి, మాజీ సర్పంచి సీతారామయ్య గారు, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.