సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల గౌరవ వేతనం

సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల గౌరవ వేతనం రూ.32.19 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో సర్పంచుల గౌరవ వేతనం రూ.19.09 కోట్లు కాగా.. ఎంపీటీసీలకు రూ.10.42 కోట్లు, జడ్పీటీసీలకు రూ.2.67 కోట్లు విడుదల చేశారు. గౌరవ వేతనం విడుదల చేయడంపై సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్‌, దయాకర్‌రావుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.