తెలంగాణలో సర్పంచ్‌లకు మాత్రమే చెక్‌ పవర్‌ ఇవ్వాలి

తెలంగాణలో సర్పంచ్‌లకు మాత్రమే చెక్‌ పవర్‌ ఉండాలని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఏపీ, తెలంగాణ పంచాయతీ చాంబర్లు ఉమ్మడి  ఖమ్మంలో  సమావేశం అయ్యారు. పంచాయతీలకు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే..  ఉద్యమం చేపడతామని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.