బాపూజీ ఆశయాలను పాటించడమే అసలైన నివాళి..*

 


*బాపూజీ ఆశయాలను పాటించడమే అసలైన నివాళి..* -.                                 -.     -.   -.     *-ప్రపంచాన్ని ఆలోచింప జేసిన వ్యక్తి గాంధీజీ*.                           -.         -.                                           *-పలు కార్యక్రమాల్లో పాల్గొన్న  నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు*.                              గాంధీజీ ఆశయాలను, ఆదర్శాలను సమాజంలో ముందుకు తీసుకుపో వడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. బుదవారం నరసరావుపేట పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఎంపీ తొలుత నరసరావుపేట పట్టణంలోని 27,28 వార్డులో  గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం లో ,  గడియార స్తంభం ప్రారంభం సందర్భంగా రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసిన సభలో, అలాగే కోట వారి సెంటర్ లో మహాత్మా గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ, సభలో  మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తో పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ..గ్రామ సచివాలయంలో తో..గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కల సాకారం అవుతుందని అన్నారు..ఈ వ్యవస్థను  అన్ని రాష్ట్రాల్లో  ప్రవేశపెడతారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీజీకి జయంతి నాడు ఇచ్చే పెద్ద కానుక గ్రామ సచివాలయం అని అన్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాగే తండ్రి బాటలోనే జగన్ అభివృద్ది పథకాలను ప్రవేశపెడుతున్నారు అని అన్నారు. గ్రామ సచివాలయం ఒక మహోన్నత కార్యక్రమం అని అన్నారు. ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అలాగే ఉద్యోగులంతా యువకులు వారు నేర్చుకోవటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రజలు కూడా వారిపై వత్తిడి చేయొద్దని చెప్పారు. ఉద్యోగస్తుల తో సమన్వయం తో పని చేయించుకోవాలని చెప్పారు.  వైద్యం చేయించుకునే ప్పుడు డాక్టర్ తో ఎలాగైతే రోగి జాగర్తగా సమస్యను చెప్తాడో అలా ఉండాలని అన్నారు.   గ్రామ స్వరాజ్యం వస్తేనే ప్రజలందరికీ అభివృద్ది ఫలాలు అందుతాయి అని గాంధీజీ చెప్పారని, అందుకు అనుగుణంగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు..