తన తండ్రి హయాంలో 14,000 మంది రైతులు ఆర్థిక బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటే... జగన్ గారు నాటి రైతు వ్యతిరేక పాలనను కొనసాగిస్తూనే... అదనంగా కార్మిక వ్యతిరేక పాలనను తెచ్చి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితి దేశంలోనే మొదటిసారి.
కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం కాబట్టి బలవన్మరణానికి పాల్పడ్డ ఒక్కో కార్మిక కుటుంబానికి రూ.25లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. అంతేకాదు పనుల్లేక పస్తులుంటున్న ప్రతి కార్మిక కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలి. Nara Chandrababu Naidu హయాంలో అసంఘటిత కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఉండేది. ఆ పథకం భవన నిర్మాణరంగ కార్మిక కుటుంబాలకు కూడా అండగా ఉండేది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పథకానికి 'వైఎస్ఆర్ బీమా' అని పేరుపెట్టారు. ఆ తర్వాత ఆ పథకం ఏమైంది? కార్మికులు చనిపోయి వారి కుటుంబాలు ఆర్థికంగా అల్లాడుతుంటే పథకం ఎక్కడుంది? నీరుగార్చిన ఆ బీమా పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలి. కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతోంది తెలుగుదేశం.
రైతు వ్యతిరేక పాలనను కొనసాగి స్తున్నది