పాడైన పులిహోర విక్రయిస్తున్నారని రూ. 51 వేల జరిమానా

పాడైపోయిన పులిహోర విక్రయిస్తున్న ఓ ఉడిపి హోటల్‌కు అధికారులు జరిమానా విధించారు. బండ్లగూడలోని శ్రీకృష్ణ ఉడిపి హోటల్‌లో పాడైన పులిహోర విక్రయిస్తున్నారని స్థానికులు నగరలపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్‌ మేనేజర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీ చేసి రూ. 51 వేల జరిమానా విధించారు.