ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వమే కాలయాపన చేసిందని సీసీఐ నేత నారాయణ ఆరోపించారు. సంబంధంలేని వ్యక్తులతో కమిటీ వేశారని, ఎస్మా ప్రయోగించడం సాధ్యం కాదని తెలిపారు. కార్మికులను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని, తాత్కాలిక డ్రైవర్లతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.