ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఓయూ విద్యార్థి సుదేంద్ర సింగ్ దాఖలు లు చేశారు. దీనిపై కుందన్‌బాగ్‌లోని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నివాసంలో విచారణ ప్రారంభమైంది.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని, ఆ హామీని విస్మరించడంతోనే కార్మికులు సమ్మె చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. సమ్మె వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని కోరారు.