మీసేవ నిర్వహకుని పై దాడి

 


వైస్సార్ సిపి నేత బెదిరింపులు


మీసేవ నిర్వహకుని పై దాడి


నెల్లూరు జిల్లా కొండాపురం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మీసేవ మరియు ఆధార్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. 


కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామానికి గ్రామానికి చెందిన విడవలపాటి మాల్యాద్రి అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా గ్రామంలో ని దాదాపు 10 మంది ఆధార్ కార్డుల నందు వయసు మార్చమని ప్రతి రోజు ఆధార్ కేంద్రానికి వస్తున్నాడు.


అలా చేయటం వీలుపడదని సదరు మీసేవ నిర్వాహకుడు చెప్పినట్లు సమాచారం.


ఆగ్రహించిన మాల్యాద్రి అనే వై.సి.పి. కి చెందిన వ్యక్తి శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో 20 మంది తన అనుచరులను తీసుకొచ్చి మీసేవ నిర్వాకుడిని బయటకి లాగి అతని మీద దాడి చేసి గాయపరిచారు.


ప్రస్తుతం సదరు మీసేవ నిర్వాహకుడు కావలి ప్రభుత్వ వైద్యశాల నందు చికిత్స పొందుతున్నారు.


Popular posts