ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ పోస్టర్లో అసలు సూత్రధారి అమరజీవి పొట్టి శ్రీరాములు ఫొటో లేకపోవడం శోచనీయం అని వ్యాఖ్యానించారు. అసలు, పొట్టి శ్రీరాములు గురించి మీ ప్రభుత్వానికి తెలుసా? లేదా? అని ప్రశ్నించారు. "వెనుకటికి ఎవరో పెళ్లికొడుకు లేకుండానే పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడట. పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అని తెలుసుకోండి సార్!" అంటూ సీఎం జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు.