వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్ట్

నెల్లూరు జిల్లా  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని  పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోటంరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కోటంరెడ్డి అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వైద్య పరీక్షల కోసం కోటంరెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని  పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ నిన్న ఢిల్లీ నుంచి రాగానే కోటంరెడ్డి విషయంలో చర్యలు తీసుకోవాలని డీజీపీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తప్పు చేస్తే ఎవరైనా సరే చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి జగన్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది